మున్సిపల్ కార్మికులకు శానిటైజర్ కిట్ల పంపిణీ

by vinod kumar |   ( Updated:2020-04-04 05:12:06.0  )
మున్సిపల్ కార్మికులకు శానిటైజర్ కిట్ల పంపిణీ
X

దిశ, మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నిత్యావసర సరుకులు, శానిటైజర్ కిట్లతోపాటు టీ షర్ట్‌లు, చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నివారణకు నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు దేవుళ్లలో సమానమని కొనియాడారు. కార్మికులు పని ముగించుకుని వెళ్లిన తర్వాత తల స్నానం చేయనిదే ఇంట్లోకి వెళ్లరాదని సూచించారు. తరచూ చేతులను సబ్బుతో కడుక్కోవాలని తెలిపారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ విధులు నిర్వర్తించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొరమోని నర్సింహులు, కమిషనర్ సురేందర్, వైస్ చైర్మన్ తాటి గణేష్, కౌన్సిలర్ రాము, ప్లోర్ లీడర్లు, తదితరులు పాల్గొన్నారు.

Tags: minister, distributed, sanitation kits, mbnr, municipal workers, corona, virus,chairman, narasimhulu

Next Story

Most Viewed