- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫోన్ మాట్లాడేందుకు జెయింట్ వీల్ ఎక్కిన మంత్రి.. ఎక్కడంటే?
దిశ, ఫీచర్స్ : ‘డిజిటల్ ఇండియా’ పథకం ద్వారా దేశం వెలుగొందుతోందని, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని పాలకులు ఓ వైపు చెప్తుండగా.. మరోవైపు ఫోన్ సిగ్నల్ కోసం ఓ రాష్ట్ర మంత్రి 50 అడుగుల ఎత్తుపైకి వెళ్లాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు కేంద్ర ప్రభుత్వ ‘డిజిటల్ ఇండియా’ ప్రోగ్రాంను విమర్శిస్తుండటంతో పాటు సదరు మంత్రి ఫొటోలను షేర్ చేస్తూ నెట్టింట మీమ్స్, జోక్స్ క్రియేట్ చేస్తున్నారు. వివరాల్లోకెళితే..
మధ్యప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ మంత్రి బ్రిజేంద్ర సింగ్ యాదవ్ అధికారిక పర్యటనలో భాగంగా ఆదివారం అశోక్ నగర్ జిల్లాలోని అంఖో గ్రామానికి వచ్చారు. ఇక్కడ ఆయన ‘భాగవత్ కథా పారాయణం, శ్రీరాం మహాయాగ’ కార్యక్రమాలను ప్రారంభించాల్సి ఉంది. ఈ క్రమంలోనే స్థానికులు తమ గ్రామంలో నెలకొన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వాటిని పరిష్కరించేందుకు గాను మినిస్టర్ ఆఫీసర్లతో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. నెట్‌వర్క్ సిగ్నల్స్ లేవు. దీంతో మంత్రి 50 అడుగుల ఎత్తులో గల జెయింట్ వీల్‌పైకి ఎక్కి ఫోన్ మాట్లాడారు. దాదాపు 3 గంటలపాటు అక్కడే కూర్చొని మాట్లాడిన మంత్రి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి