ఆస్తి పన్ను పెంపుపై ఆందోళన అవసరం లేదు

by srinivas |
ఆస్తి పన్ను పెంపుపై ఆందోళన అవసరం లేదు
X

దిశ, విశాఖపట్నం: రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీల్లో ఆస్తి పన్ను పెంపు విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం విశాఖలో ఎంతో ప్రతిష్టాత్మాకంగా సిద్దం చేసిన ఎన్‌ఎడి ప్లైఓవర్‌ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్‌ కష్టాలు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే ఆస్తి పన్నవిషయంలో 15 శాతానికి మించొద్దని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.ఆస్తి పన్ను పెంపుపై ఆందోళన అవసరం లేదన్నారు. 350 గజాలు ఉన్నవారికి రూ.50 మాత్రమే పెరుగుతుందని స్పష్టం చేశారు. దీనిపై కావాలనే ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.

Next Story

Most Viewed