- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అవినీతిపై ఆధారాలు ఉన్నాయి : బొత్స

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి పేరుతో దోచుకు తినాలని చూశారని విమర్శించారు. అమరావతి ఉద్యమం ఒక షో మాత్రమే అని ఎద్దేవా చేశారు. నిర్మించిన తాత్కాలిక భవనాలు, చేసిన దోపిడీని చూసి ప్రజలు తిరస్కరించారని తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బొత్స అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మంచి కార్యక్రమాలను కోర్టులకెళ్లి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షం దుర్మార్గమైన ఆలోచనతో అభివృద్ధిని అడ్డుకుంటుందని వెల్లడించారు. వాళ్లకున్న పరిచయాలతో కోర్టులను కూడా ప్రభావితం చేస్తున్నారని తెలిపారు. రైతుల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న అంకితభావం ఎవరికీ లేదని అన్నారు. తమది పూర్తిగా రైతు ప్రభుత్వం అని స్పష్టం చేశారు. అమరావతిలో జరిగిన అవినీతిపై ఆధారాలు ఉన్నాయని సంచలణ ఆరోపణలు చేశారు. విశాఖ భూములపై కూడా విచారణ చేపడుతామని స్పష్టం చేశారు. తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకుంటామని అన్నారు.