విద్యుత్ సంక్షోభంపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన ఆరోపణలు

by srinivas |
విద్యుత్ సంక్షోభంపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన ఆరోపణలు
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో నెలకొన్న విద్యుత్ సంక్షోభంపై విద్యాశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభం తాత్కాలికమేనని చెప్పుకొచ్చారు. బొగ్గు కొరత దృష్ట్యా రాష్ట్ర విద్యుత్ రంగంలో నెలకొన్న ఒడిదుడుకులు తొందర్లోనే తొలగిపోతాయని మంత్రి బాలినేని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి బొగ్గు కొరత లేదని.. అక్కడున్న బొగ్గు నిల్వలను ఏపీకి ఇవ్వడంలేదని బాలినేని ఆరోపించారు. అలాగే రాష్ట్రంలో శ్రీశైలంలో మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేసుకోగలుగుతున్నామని ఈ విషయాన్ని రాజకీయం చేయోద్దంటూ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ట్విటర్ వేదిగా వెల్లడించారు.

బొగ్గు కొరత దేశవ్యాప్తంగా ఉందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో బొగ్గు కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. జెన్ కో కేంద్రాలను అనాలోచితంగా మూసివేయలేదని వివరణ ఇచ్చారు. బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే వేలం ద్వారా విద్యుత్ కొనుగోలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. బొగ్గు కొరత కారణంగా యూనిట్లను పూర్తిస్థాయిలో నడపలేని పరిస్థితి ఉందని, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రాయలసీమ థర్మల్ ప్లాంట్‌లో మరమ్మతులు చేపట్టినట్లు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed