టీడీపీ వాళ్లే రథాలను తగలబెట్టారు: బాలినేని

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ నేతలపై మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఫైర్ అయ్యారు. వాళ్లే రథాలను తగలబెట్టి ప్రభుత్వంపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి భయపడి మతాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అందుకే సీఎం జగన్ రథం ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించారని పేర్కొన్నారు. పుష్కరాల్లో 40మందిని బలితీసుకున్న చంద్రబాబుకు చరమగీతం పాడేరోజు దగ్గర్లోనే ఉందన్నారు. గురువారం ఒంగోలులో మంత్రి బాలినేని మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

Advertisement