ఆ ఎమ్మెల్యేకు మంత్రి అవంతి స్ట్రాంగ్ వార్నింగ్

by srinivas |
ఆ ఎమ్మెల్యేకు మంత్రి అవంతి స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ,విశాఖపట్నం: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మాకంగా అమలు చేస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఇలా చేస్తున్నారని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఆదివారం విశాఖలో ఆయన మాట్లాడుతూ విశాఖ జిల్లాలో జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరమన్నారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి స్థాయి మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్, ఎంపీ విజయసాయిని అనే స్థాయి వెలగపూడికి లేదని పేర్కొన్నారు. పిచ్చిపిచ్చి ప్రేలాపణలు పేలితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వెలగపూడి ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారో ప్రజలకు తెలుసు అని చెప్పారు. వెలగపూడిపై క్రిమినల్ చర్యలు తప్పవని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు.

Advertisement

Next Story