మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా

దిశ, వెబ్ డెస్క్: విశాఖ హిందూస్థాన్ షిప్ యార్డ్ క్రేన్ ప్రమాదంలో 11 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆదివారం మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు విశాఖ షిప్ యార్డ్ యాజమాన్యంతో మంత్రి గంటకుపైగా సమావేశమయ్యారు.

Advertisement