- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సంపూర్ణేష్ బాబు అయినా..పవన్ కల్యాణ్ అయినా ఒక్కటే’
దిశ, ఏపీ బ్యూరో : జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రెచ్చిపోయారు. ఆన్‌లైన్ టికెట్ల పోర్టల్ అంటే కళ్యాణ్ ఎందుకంత భయపడిపోతున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో శనివారం రాత్రి జరిగిన రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పవన్ వ్యాఖ్యలకు అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయ ఉనికి కోసమే పవన్ తాపత్రాయపడుతున్నారంటూ విమర్శించారు.
నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని వెంకటేశ్వర పురం జనార్దన్ రెడ్డి కాలనీ లో రూ.10 లక్షల రూపాయలతో పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఒకే ఒక్క స్థానానికి పరిమితం అయిన పవన్ కళ్యాణ్ ప్రస్తుత పరిషత్ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి ఎదురైందన్నారు. పారదర్శకత కోసమే టికెట్లకు సంబంధించి ఆన్లైన్ పోర్టల్‌ను తీసుకు వచ్చామన్నారు. తమకు సంపూర్ణేశ్ బాబు అయినా… పవన్ కళ్యాణ్ అయినా ఒక్కటేనని చెప్పారు. సినిమాల్లో వారిద్దరిలో ఎవరు నటించినా కష్టం అనేది ఇద్దరిదీ ఒకటేనని ఆయన వ్యాఖ్యానించారు. చిన్న హీరోల సినిమా టిక్కెట్స్ కు ఒక రేటు.. పెద్ద హీరోలకి ఒక రేటు అంటూ ఉండదని హీరోలందరికీ టికెట్ రేట్ ఒకేరకంగా ఉంటుందన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పార్టీ పుంజుకునే పరిస్థితి లేదని ఆ పార్టీ పరిస్థితి చాప చుట్టేయడమేనని తనదైన శైలిలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు.