- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మేం ఏ తప్పు చేయలేదు.. కావాలనే : విద్యాశాఖ మంత్రి
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులపై ఆదాయానికి మించి ఆస్తులున్నాయంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం సుప్రీకోర్టు విచారణ చేపట్టింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్నాధ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. సీబీఐ కేసు కొనసాగింపునకు అత్యున్నత ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది. మంత్రి సురేశ్ దంపతులపై సీబీఐ గతంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ ఎఫ్ఐఆర్‌ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు గతంలో ఉత్తర్వులిచ్చింది.
ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు 120 మంది సాక్షులను విచారించామని సీబీఐ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. మరో 3 నెలల్లో విచారణ పూర్తి చేస్తామని కోర్టుకు తెలిపింది. చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని సీబీఐ సుప్రీంకోర్టును కోరింది. ఈ పరిణామాలపై మంత్రి సురేశ్ దంపతులు స్పందించారు. తమపై కక్ష సాధింపునకే సీబీఐ విచారణ చేపట్టిందని ఆరోపించారు. తాము ఏ తప్పు చేయలేదని నిర్ధోషిగా భయటపడతామని మంత్రి సురేశ్ దంపతులు ఆశాభావం వ్యక్తం చేశారు.