- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘‘ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి’’
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు విస్మరించిన ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు గడ్డ వెంకటేశం అన్నారు. బుధవారం పోచంపల్లి ఎంపిడిఓకు వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. అనంతరం పంచాయతీ కార్మికులు మాట్లాడుతూ… గ్రామ పంచాయతీ కార్మికులు 2018 సంవత్సరంలో 42 రోజులు సమ్మె చేయగా ప్రభుత్వం మాయమాటలు, అబద్దపు వాగ్దానాలు చేసి సమ్మె విరమింపజేసిందనీ, 2019 సంవత్సరంలో జీవో ప్రకారం.. రూ.8500 వేతనం మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం జీవో తీసుకొచ్చి ఐదు నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకూ అమలు జరగలేదని వారు విమర్శించారు. గ్రామాల్లో రాజకీయ నాయకుల అధికారుల వేధింపులు అరికట్టాలని కోరారు. పెంచిన వేతనాలు ఇవ్వకుండా చాలీచాలని వేతనాలతో కార్మికులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలను అర్థం చేసుకొని వెంటనే కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల మనోభావాలు దెబ్బతింటున్నాయనీ, ఆ వెంటనే విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మిక సంఘం మండల అధ్యక్షులు నరసింహ స్వామి, చంద్రయ్య, శారధ, కళమ్మ, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు.