Telangana Gurukulam : మైనార్టీ గురుకుల స్కూల్, కాలేజీ ప్రవేశ దరఖాస్తులు పెంపు..

by Sridhar Babu |   ( Updated:2021-05-27 10:39:25.0  )
Telangana Gurukulam : మైనార్టీ గురుకుల స్కూల్, కాలేజీ ప్రవేశ దరఖాస్తులు పెంపు..
X

దిశ, మానకొండూరు : తెలంగాణ మైనారిటీ రెసిడెన్సియల్ పాఠశాల, జూనియర్ కళాశాల బాయ్స్-1 కరీంనగర్‌లో 5వ తరగతితో పాటు 6,7,8.. ఇంటర్ ప్రథమ & ద్వితీయ సంవత్సరం మిగులు సీట్లకు గాను విద్యార్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ వీర్ల మహేష్, ఆర్ఎల్‌సీబీ అంబేద్కర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రవేశాల దరఖాస్తులకు చివరి తేదీని 31-05-2021గా ప్రకటించారు. ఈలోపు సంబంధిత వెబ్ సైట్ tmreis.telangana.cgg.gov.inలో గానీ, విద్యార్థులు పాఠశాలను సంప్రదిస్తే స్వయంగా యజమాన్యమే ఆన్‌లైన్ ద్వారా నమోదు చేయిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యారులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ వీర్ల మహేష్ సూచించారు.

Advertisement

Next Story