పీవీకి భారతరత్న ఇవ్వాలనే తీర్మానంపై ఎంఐఎం వ్యతిరేకం

దిశ వెబ్‎డెస్క్: భార‌త మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావుకు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌న్న తీర్మానాన్ని ఎంఐఎం వ్యతిరేకించింది. పీవీకి భారతరత్న ఇవ్వాలని టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కానీ, ఎంఐఎం మాత్రం పీవీ నరసింహారావుకు భారత రత్న ఇవ్వాలనే తీర్మానానికి వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏకగ్రీవ తీర్మానం చేయలేకపోయారు.

Advertisement