- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ యాప్‌ను వెంటనే డిలీట్ చేయండి..
మాలిసియస్ (వైరస్ ఇన్‌ఫెక్టెడ్) యాప్స్ వల్ల మొబైల్‌లో సెక్యూరిటీ లోపాలు తలెత్తడంతో పాటు మొబైల్ సరిగా పనిచేయదు. డేటా కూడా హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. మొబైల్‌లో ఉన్న మాల్‌వేర్.. మొదట సెక్యురిటీ నెట్‌ను స్లిప్ చేస్తుంది. దాంతో లక్షలాది మంది యూజర్లు రిస్క్‌లో పడతారు. ఇటీవల కాలంలో చాలా పాపులర్ యాప్స్ కూడా వైరస్‌కు ఇన్‌ఫెక్ట్ అవుతున్నాయి. గతేడాదితో పోలిస్తే.. 2020 మొదటి క్వార్టర్‌లోనే మాలిసియస్ యాప్స్ రెట్టింపయినట్లు సైబర్ సెక్యూరిటీ ఫర్మ్ ‘అప్ స్ర్టీమ్ సిస్టమ్స్’ తాజా రిపోర్ట్‌లో వెల్లడించింది. అందులో ప్రధానంగా ‘స్నాప్ ట్యూబ్ యాప్’.. యూజర్ల డేటాకు చాలా హానికరమని తెలిపింది. ఈ యాప్‌ను 40 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసినట్లు ఆ రిపోర్టులో తేలింది. ‘ఈ యాప్‌లో ఇన్విజబుల్ యాడ్స్ డెలివర్ చేయడమే కాకుండా, అడ్వర్‌టైజింగ్‌ను చూడటం, వాటిని లైక్ చేయడం, ఆయా ప్రొడక్ట్‌లను పర్చేజ్ చేయడం వంటి యాక్టివిటీస్ యూజర్‌కు తెలియకుండానే జరుగుతున్నాయి’. ఇలాంటి సస్పీషియస్ యాక్టివిటీస్ ఈజిప్ట్, బ్రెజిల్, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా, మలేషియా దేశాలకు చెందిన యూజర్ డివైజ్‌లలో ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి.
2020లోనే స్నాప్ ట్యూబ్‌కు సంబంధించిన 32 మిలియన్ల ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్‌ను ‘ద సెక్యూర్ డి ప్లాట్‌ఫామ్’ బ్లాక్ చేసింది. ఇప్పటికే ఈ యాప్‌ను గూగుల్ కూడా డిలీట్ చేసింది. అయినా థర్ట్ పార్టీ యాప్ స్టోర్‌లో ఇది అందుబాటులో ఉంది. అయితే ఇక ముందు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేయకూడదని అప్‌స్ట్రీమ్ సిస్టమ్స్ సూచిస్తోంది. అంతేకాదు.. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న ఆండ్రాయిడ్ యూజర్లు వెంటనే దీన్ని డిలీట్ చేయాలని చెబుతోంది.
స్నాప్ ట్యూబ్ : ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్ అయిన ‘యూట్యూబ్, ఫేస్‌బుక్’లో షేర్ చేసిన ఆడియో, వీడియో క్లిప్స్‌ను ఈ యాప్ యూజర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీన్ని చైనాకు చెందిన మొబిస్పేస్ అనే కంపెనీ డెవలప్ చేసింది.