- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పాల ప్యాకెట్లు, పాడైన ఫర్నిచర్‌తో.. సస్టెయినబుల్ ప్రొడక్ట్స్
దిశ, ఫీచర్స్: బెంగుళూరులోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఒక సైన్స్ టీచర్.. పిల్లలకు బోధించాల్సిన సిలబస్‌లో పాఠ్యాంశాలతోపాటు ఆరోగ్యకరమైన జీవనశైలికి పెంపొందించుకోవాల్సిన విషయాలను కూడా చేర్చడం విశేషం. ఇందుకు గాను ఈ ఏడాది ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయనను సన్మానించిన నేషనల్ అవార్డ్స్ ఫర్ టీచర్స్(NAT).. అతడు పనిచేస్తున్న దొడ్డబనహల్లి పాఠశాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ సంక్షోభం వల్ల తలెత్తే పరిమాణాలపై మేల్కొలిపేందుకు ఎకో-కాన్షియస్ కార్యక్రమాలను ప్రవేశపెట్టినందుకు గాను నాగరాజుకు ఈ అవార్డు లభించింది.
అందరినీ ఆకట్టుకున్న సస్టెయినబుల్ హ్యాక్స్..
పర్యావరణ అనుకూల జీవనశైలిని ఇష్టపడే నాగరాజుకు ఎన్నో ఆలోచనలున్నా.. నిధుల కొరత వల్ల అతని ప్రాజెక్ట్ ఆలస్యమవడంతో నగరంలోని NGOలను సంప్రదించాడు. ఇదే సమయంలో వ్యర్థాల నిర్వహణకు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. కుర్చీలు, టేబుల్స్‌తో సహా పాత, విరిగిన మెటల్ ఆధారిత ఫర్నిచర్‌ను తిరిగి రూపొందించాడు. బోధనా సిబ్బంది కోసం 20 విరిగిన ముక్కలను ఉపయోగించి న్యూస్ పేపర్ రీడింగ్ స్టాండ్స్, ప్రొజెక్టర్ స్క్రీన్, డయాస్, పోడియం, నేమ్ ప్లేట్స్, అల్మారాలుగా మార్చాడు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పాఠశాలలో విద్యార్థులకు పాలు అందిస్తుండగా.. ఆ తర్వాత వృథాగా పడేస్తున్న ఖాళీ పాల ప్యాకెట్లతో పాఠశాలలోని 20 కంప్యూటర్ సిస్టమ్‌లకు కొత్త స్టైలిష్ కవర్‌లను రూపొందించాడు. నాగరాజు చేపడుతున్న కార్యక్రమాలను చూసి ఐదు ఎన్జీవోలు స్ఫూర్తి పొందాయి.
సమీప పొలాల నుంచి సేకరించే ఆకులు, వ్యవసాయ వ్యర్థాలు వంటి బయోవేస్ట్ కోసం ఒక కన్వర్టర్‌ను.. పాఠశాల వంటగదిలో ఉత్పత్తయ్యే ఆహార వ్యర్థాల కోసం మరొక కన్వర్టర్‌ను ఏర్పాటు చేసి 6-8 నెలల్లోనే 1 టన్ను ఎరువును ఉత్పత్తి చేశారు. ఇక ఏడాది కాలంలో సేకరించిన 58 కిలోల ప్లాస్టిక్, పేపర్ వ్యర్థాలు స్థానిక రీసైక్లర్‌కు ఇచ్చినట్లు నాగరాజు తెలిపారు. పాఠశాల ఆవరణలో వర్షపు నీరు, వ్యర్థజలాలను నిల్వ చేయడానికి ఐదు భూగర్భ జలాల రీఛార్జింగ్ గుంటలు ఉన్నాయి. ఈ నీటిని పాఠశాలలో పాత్రలు కడిగేందుకు, మొక్కలకు నీరు పెట్టడానికి ఉపయోగిస్తారు. వ్యర్థాలను సురక్షితంగా పారేయడం, పునర్వినియోగించడాన్ని అలవాటుగా చేసుకున్న నాగరాజు.. వాడిపడేసిన సీసాలను ఉపయోగించి విద్యార్థుల కోసం కెమిస్ట్రీ కిట్ తయారు చేయగలిగాడు. ఇంట్లో కూడా రసాయన ప్రయోగాలు చేయడానికి వీలుగా విద్యార్థులు ఉపయోగించే చిన్న పోర్టబుల్ కిట్‌లను తయారు చేశాడు.
నిజానికి భారతదేశంలోని ప్రభుత్వ పాఠశాలలు మంచి ఇమేజ్‌ను కలిగి ఉండవు. అయితే గత కొన్నేళ్లుగా మార్పు కనిపిస్తోంది. మనుషులను ఉద్ధరించడానికి, వారిలోని సృజనాత్మకతను వెలిగించేలా ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించడానికి నాగరాజు వంటి ఉపాధ్యాయులకు కృషి చేస్తున్నారు. కాగా ‘ఏ రంగంలోనైనా పిల్లల ఆసక్తి లేదా నిరాసక్తత.. ఆ విషయం ఎలా బోధించబడుతుందనే దానిపై ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఉపాధ్యాయుడు విద్యార్థులపై శాశ్వత ముద్రలను సృష్టించగలడని గుర్తుంచుకోవడం ముఖ్యం’ అని ఆయన ముగించారు.