జనాలు పిచ్చోళ్లనుకున్నా: మిలింద్ సోమన్

by Shyam |
జనాలు పిచ్చోళ్లనుకున్నా: మిలింద్ సోమన్
X

మోడల్ నుంచి నటుడిగా మారిన మిలింద్ ఉషా సోమన్.. ‘ఫోర్ మోర్ షాట్స్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు పొందాడు. ఇందులో డాక్టర్‌గా కనిపించిన మిలింద్.. ప్రపంచాన్ని అద్భుత ప్రదేశంగా అభివర్ణించారు. తను యంగ్‌గా ఉన్నప్పటి ఫొటోను షేర్ చేసిన ఆయన.. 1989లో తన మొదటి షూటింగ్‌లో జరిగిన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

ఆ టైమ్‌లో…

ఫస్ట్ యాడ్ షూట్ కోసం ఎంపికైన తాను చాలా హ్యాపీగా ఉండగా.. కేవలం కొన్ని గంటల పాటు పలు ఫొటోలు తీసేందుకు ఏకంగా రూ. 50 వేలు ఇస్తామని ఆఫర్ చేశారని.. ఆ మాట విని ఆశ్చర్యపోయానని తెలిపాడు. కొన్ని గంటల పనికి రూ.50 వేలు ఇవ్వడమేంటి?.. వాళ్లు నిజంగా పిచ్చోళ్లని అనుకున్నట్టు చెప్పాడు. ఆ టైమ్‌లో తనొక హోటల్‌లో పనిచేస్తున్నానని తెలిపిన మిలింద్.. వెయిటర్‌గా, కుక్‌గా కెరియర్ ప్రారంభించినట్లు తెలిపాడు. హోటల్‌లో పనిచేయడం కూడా తనకు నచ్చిందని.. ఈ ప్రపంచం చాలా గొప్ప ప్రదేశమని చెప్పాడు.

https://www.instagram.com/p/CC-mP89HTjH/?utm_source=ig_web_copy_link

Advertisement

Next Story

Most Viewed