- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2020 ది బెస్ట్ ఇయర్ : రానా మిహిక
దిశ, వెబ్‌డెస్క్: 2020.. మిక్చర్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగెటివ్ అని అందరూ అంటున్న మాటే. అయితే 2020లోనే పెళ్లి పీటలెక్కిన పలువురు టాలీవుడ్ యంగ్ బాచిలర్స్.. హాలీడే డెస్టినేషన్స్‌లో తమ ఇష్టసఖులతో హ్యాపీగా గడిపేశారు. వాళ్లందరి లైఫ్ డైరీలో ‘ట్వంటీ ట్వంటీ’ నిజంగా ఓ మధుర జ్ఞాపకమే. ఈ జాబితాలో టాలీవుడ్ హంక్ రానా, మిహికా జంట కూడా జాయిన్ కాగా.. రానా బెటర్ హాఫ్ మిహిక కూడా ఇదే విషయం చెబుతోంది. అందరికీ 2021 – నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మిహిక.. 2020 తమ జీవితంలో ఓ మంచి సంవత్సరంగా నిలిచిందని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన మనసులోని మాటలను పంచుకుంది.
‘అందరికీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. 2020 మాకు ఎంతో అదృష్టాన్ని, ప్రేమను, టన్నుల కొద్దీ సంతోషాన్ని అందించింది. అందరికీ 2020 విషాదాన్ని మిగిల్చినా, నా జీవితంలో మాత్రం ది బెస్ట్ ఇయర్‌గా నిలిచింది. అదంతా రానా వల్లే సాధ్యమైంది. థ్యాంక్యూ మై లవ్ రానా. ఇక్కడ నుంచి ఇంకా పైపైకి ఎదగాలి. ఈ ఏడాది అందరిలోనూ సంతోషాన్ని నింపాలని కోరుకుంటున్నాను’ అని రానాతో దిగిన ఫొటోను షేర్ చేసింది మిహిక. కాగా వీరిద్దరూ ఒక్కటైన తర్వాత వచ్చిన తొలి ఏడాదిని ఈ యువ జంట హైదరాబాద్‌లోని తమ నివాసంలోనే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.