శంకర్ పల్లి టూ దేవరకొండ.. వలస కూలీల వెతలు

by Shyam |   ( Updated:2020-04-13 04:40:38.0  )
శంకర్ పల్లి టూ దేవరకొండ.. వలస కూలీల వెతలు
X

దిశ, రంగారెడ్డి: వారంతా పొట్ట చేతపట్టుకొని కడుపు నింపుకోవడానికి పని నిమిత్తం రంగారెడ్డిలోని శంకర్ పల్లి వెళ్లారు. అక్కడే ఒక వెంచర్లో పనిచేసుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో వారికి పని కరువైంది. ఈ నెల 14న లాక్ డౌన్ ముగుస్తుందన్న ఆశతో అక్కడే ఉండిపోయిన వారికి లాక్ డౌన్ పొడిగించడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. దీంతో ఐదుగురు చిన్నారులతోపాటు మూడు కుటుంబాలు తమ సొంత గ్రామమైన నల్లగొండలోని దేవరకొండకు వెళ్లేందుకు కాలినడకన బయలుదేరారు. ఈ క్రమంలో సోమవారం కేశంపేట మీదుగా వెళ్తున్న వీరిని గమనించిన స్థానిక ఎస్సై కోన వెంకటేశ్వర్లు ఆపి వివరాలు తెలుసుకున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో పంపించడానికి వీలుకాదని, ఉండటానికి వసతి కల్పిస్తామని వారికి భరోసా ఇచ్చారు. కేశంపేట సర్పంచ్ తలసాని వెంకట్ రెడ్డి వారికి భోజన వసతి కల్పించి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. మండుటెండలో ఐదుగురు చిన్నారులతో కాలినడకన వెళుతున్న వారి పరిస్థితి చూసిన పలువురు చలించిపోయారు.

tags: lockdown, corona, migrant labourers, shankarpalli, devarakonda, si venkateswarlu, sarpanch venkat reddy

Next Story

Most Viewed