పట్టించుకునే వారులేక… వలస కూలీ మృతి

by Sumithra |
పట్టించుకునే వారులేక… వలస కూలీ మృతి
X

దిశ, నల్గొండ: సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని మాణిక్యంతండాలో విషాదం నెలకొంది. అనారోగ్యంతో మధ్యప్రదేశ్‎కు చెందిన ఓ వలస కూలీ మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం మధ్యప్రదేశ్‎కు చెందిన సీతారాం(19) నాగారం మండలంలోని మాణిక్యంతండా వద్ద ఉన్న క్రషర్ మిల్లులో 10 నెలలుగా హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. వారం రోజులుగా అతడు జ్వరంతో బాధ పడుతున్నాడు. ఈ విషయంపై క్రషర్ మిల్లు యజమానికి చెప్పినా పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుధవారం రాత్రి తీవ్ర జ్వరంతో సీతారా మృతి చెందారు. కాగా, కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే అంత్యక్రియలు చేయడానికి ప్రయత్నించగా సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై మర్రి లింగం తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.

Tags: migrant worker, died, health problem, nagaram, suryapet



Next Story

Most Viewed