మందు లేదని శానిటైజర్ తాగాడు.. చివరకు

by Sridhar Babu |
మందు లేదని శానిటైజర్ తాగాడు.. చివరకు
X

దిశ, మానకొండూరు: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చాకలివానిపల్లి గ్రామంలో శానిటైజర్ తాగి వలసకూలీ చాషేక్ సైదా (26) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు ఒంగోలు జిల్లా కందుకూరు గ్రామానికి చెందిన వ్యక్తి. బతుకుదెరువుకోసం గన్నేరువరం మండల కేంద్రంలోని చాకలివానిపల్లి గ్రామంలో భవన నిర్మాణ పనులు చేసే మేస్త్రి కస్తూరి వెంకటేశం వద్దు కూలీగా పని చేస్తున్నాడు. ఇదే సమయంలో మందుకు బానిసగా మారిన చాషేక్ సైదా డబ్బులు దొరకక నిత్యం శానిటైజర్ తాగడం అలవాటు చేసుకున్నాడు. ఈ ఎఫెక్ట్‌తో కడుపునొప్పి రావడంతో బాధపడుతూ మళ్లీ శానిటైజర్ తాగాడు. దీంతో కడుపునొప్పి అధికమైంది. అతడి బాధను గమనించిన తోటి కార్మికులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు.



Next Story

Most Viewed