- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్ నేతలు మోసం చేశారు.. కాంగ్రెస్‌లో చేరిన ఎంపీపీ కాంతమ్మ
దిశ, జడ్చర్ల: మిడ్జిల్ మండల పరిషత్ అధ్యక్షురాలు బొల్లెపోగు కాంతమ్మ బాలస్వామి గురువారం టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ కార్యదర్శి జనంపల్లి అనిరుద్ రెడ్డి.. కాంతమ్మ బాలస్వామికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ.. 2018 స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి, ఎంపీపీగా ఎన్నికైన కాంతమ్మ బాలస్వామిని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తప్పుడు హామీలతో ప్రలోభపెట్టారని విమర్శించారు. హామీలు ఇచ్చి ఏడాదైన అమలు చేయకపోవడం పట్ల విరక్తి చెందిన ఎంపీపీ కాంతమ్మ గురువారం తిరిగి సొంత గూటికి చేరిందని స్పష్టం చేశారు.
అభివృద్ధి పేరిట మోసం చేశారు.. ఎంపీపీ
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీటీసీగా గెలిచి, ఎంపీపీగా ఎన్నికైన తనను అభివృద్ధి కార్యక్రమాల పేరిట.. టీఆర్ఎస్ లీడర్లు మోసం చేశారని మిడ్జిల్ మండల ఎంపీపీ కాంతమ్మ బాలస్వామి అన్నారు. అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తామని, దీంతో మండలంతో పాటు గ్రామాలు కూడా సస్యశ్యామలం చేయవచ్చని.. అందుకే టీఆర్ఎస్ చేరమని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారన్నారు. కానీ, నేటికి ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరుకోవడం జరిగిందని అభివర్ణించారు.