- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Microsoft :వందల్లో ఉద్యోగాలు.. తెలంగాణలో డేటా సెంటర్..!

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ తెలంగాణలో తన పరిధిని మరింత విస్తరించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. మొత్తం రూ. 15,000 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు మైక్రోసాఫ్ట్ కంపెనీ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. చర్చలు తుది దశకు చేరుకున్న తర్వాత మైక్రోసాఫ్ట్ సంస్థ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా వందల్లో ఉద్యోగాలను కల్పించే వీలుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ఉన్నాయి. ఆయా కార్యాలయాల్లో సాఫ్ట్‌వేర్ నిపుణులు పనిచేస్తున్నారు. వీటికి అదనంగా మరో డేటా సెంటర్‌ను నెలకొల్పేందుకు మైక్రోసాఫ్ట్ ప్రణాళిక రూపొందించింది. మైక్రోసాఫ్ట్ భారత్‌లో బ్రూక్‌ఫీల్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో జాయింట్ వెంచర్‌ను నెలకొల్పి బీఏఎం డిజిటల్ రియాల్టీ బ్రాండ్ పేరుతో ఈ డేటా సెంటర్ సౌకర్యాలను ప్రారంభించనుంది. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు సాఫ్ట్‌వేర్ కంపెనీలకు సంబంధించిన డేటా సెంటర్లను నిర్మించేందుకు ఈ బ్రూక్‌ఫీల్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ మౌలిక సదుపాయాలను అందిస్తోంది. తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు విజయవంతమైతే డేటా సెంటర్‌కు సంబంధించిన నిర్మాణ పనులు, ఇతర కార్యకలాపాలను బీఏఎం డిజిటల్ రియల్టీకి అప్పగించే అవకాశాలు ఉన్నాయి.