ఒక్క మీటింగ్‌లో 20 వేల మంది!

by  |
ఒక్క మీటింగ్‌లో 20 వేల మంది!
X

కరోనా పాండమిక్ కారణంగా దిగ్గజ కంపెనీలన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్‌కు మారిపోయాయి. కానీ టీమ్‌ల మధ్య సమన్వయం కోసం రోజుకి కనీసం మూడు నుంచి నాలుగు మీటింగ్స్ అవసరమవుతుంటాయి. ప్రస్తుతానికి 50 నుంచి 100 మందితో మీటింగ్ పెట్టుకునే అవకాశం ఉన్నప్పటికీ ఏదో లోటు కనిపిస్తోందని కంపెనీలు చెబుతున్నాయి. అంటే కార్పొరేట్ కంపెనీల్లో విభిన్న టీమ్‌ల మధ్య సమన్వయం కోసం అప్పుడప్పుడు పెద్ద ఎత్తున కల్చరల్ ఈవెంట్లు నిర్వహించేవారు. అలాగే కంపెనీ పురోగతిని అందరితో పంచుకోవడానికి ప్రత్యేక వేడుకలు చేసుకునేవారు. కానీ ఇప్పుడు అలా సాధ్యం కావడం లేదు. మీటింగ్ అనగానే అది కచ్చితంగా పనికి సంబంధించిన మీటింగ్ అనుకుంటున్నారు. అంతేకాకుండా జూమ్, గూగుల్ మీట్, స్కైప్ ఇలా ఏ యాప్ తీసుకున్నా అందులో పార్టిసిపెంట్‌ల పరిమితి ఉంది.

ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటన చేసింది. తమ టీమ్ సర్వీస్‌లో దాదాపు 20 వేల మంది ఒకే వర్చువల్ మీటింగ్‌లో పాల్గొనే సదుపాయాన్ని కల్పించబోతున్నట్లు ప్రకటించింది. అయితే వీళ్లందరికీ మాట్లాడే అవకాశాన్ని కల్పించదు. ఇది కేవలం ఒక వేడుకను నిర్వహిస్తుంటే అందరూ చూడటానికి వీలు కల్పించడానికి చేస్తున్న ప్రయత్నం అని మైక్రోసాఫ్ట్ తెలిపింది. అలాగే మైక్రోసాఫ్ట్ టీమ్స్ రూమ్స్ ప్రీమియం వినియోగదారులకు మాత్రమే ఈ సదుపాయాన్ని మైక్రోసాఫ్ట్ అందించనుంది. 20 వేల మందిని మేనేజ్ చేయడానికి వీలుగా అందుకు సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కూడా అభివృద్ధి చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ తమ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.


Next Story

Most Viewed