- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎలుకలు కొరికిన నోట్లు.. రూ.44 వేలు RBI వెనక్కి..
దిశ, తెలంగాణ బ్యూరో: కష్టార్జితాన్ని దాచుకున్న ఓ సామాన్యుడిని ఎలుక చికాకు పెడితే రిజర్వు బ్యాంకు కాస్త ఉపశమనం కల్పించింది. ఎలుకలు కొరికిన నోట్లలో నెంబర్లు కనిపించేవాటిని తీసుకున్న హైదరాబాద్‌లోని ఆర్బీఐ కొత్త నోట్లను ఇచ్చింది. ఎలుకలు కొరికిన రూ. 500 నోట్లలో నెంబర్లు ఉన్న మేరకు 88 నోట్లకు సమానంగా రూ.44 వేలను సమకూర్చింది. మహబూబాబాద్ జిల్లా వేమునూరు గ్రామానికి చెందిన కూరగాయల చిరువ్యాపారి రెడ్యానాయక్ తన వైద్య చికిత్స నిమిత్తం రెండు లక్షల రూపాయలను దాచుకుంటే ఎలుకలు కొరికేశాయి. జిల్లా స్థాయిలో ఎన్ని బ్యాంకులకు తిరిగినా కొత్త నోట్లు ఇవ్వడానికి సిబ్బంది నిరాకరించారు.
చివరకు మంత్రి సత్యవతి రాథోడ్ చొరవతో స్థానిక తహసీల్దార్ రంజిత్ చొరవ తీసుకుని రాజశేఖరరెడ్డి అనే వీఆర్ఏకు బాధ్యత అప్పగించారు. స్వయంగా బాధితుడిని హైదరాబాద్‌లోని రిజర్వు బ్యాంకుకు తీసుకెళ్ళి రూ. 44 వేల మేర ఇప్పించారు. మిగిలినవాటి సంగతి పరిష్కారం తేలాల్సి ఉన్నది. మంత్రి సత్యవతి రాథోడ్ మొత్తం డబ్బులు తన వ్యక్తిగత హోదాలో ఇస్తానని బాధితుడికి హామీ ఇచ్చారు.