- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బోరున ఏడ్చిన పోర్న్‌స్టార్.. ఆమె నా జీవితాన్ని నాశనం చేసిందంటూ..

దిశ, సినిమా: మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా సోషల్ మీడియా వేదికగా సంచలన కామెంట్స్ చేస్తూ కన్నీరుమున్నీరుగా విలపించింది. అయితే తన భావోద్వేగానికి కారణం.. ప్రముఖ గాయని టేలర్ స్విఫ్ట్ అని, ఆమె తన జీవితాన్ని నాశనం చేసిందని చెప్పింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో తను ఏడుస్తున్న పిక్స్ షేర్ చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇక అసలు విషయానికి వస్తే.. ఇటీవల టేలర్ తన ఆల్బమ్ ‘రెడ్’ని మొత్తం రీ-రికార్డ్ చేసి ఓ పాటను రిలీజ్ చేసింది. దీనిని టేలర్ వెర్షన్ అని కూడా పిలుస్తుండగా.. ఈ అల్బమ్‌లో ‘ఆల్ టూ వెల్’ పాట విడుదలైన వెంటనే సెలబ్రిటీలతో పాటు చాలా మంది అభిమానులు దీనిపై స్పందించారు.
ఈ క్రమంలోనే టేలర్‌కు వీరాభిమాని అయిన ఖలిఫా కూడా తనదైన శైలిలో స్పందిస్తూ.. ‘బ్లాండీ ఈ 10 నిమిషాల ఆల్ టూ వెల్‌తో నా జీవితాన్ని నాశనం చేసింది’ అని క్యాప్షన్ యాడ్ చేసింది. ఈ పాట విని భావోద్వేగానికి గురైనట్లు తెలిపింది. అంతేకాదు ‘ఆల్ టూ వెల్’ సాంగ్ వింటూ కుక్కను ఎత్తుకున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అయితే మియా ఖలీఫా టేలర్ గురించి కామెంట్స్ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు టేలర్ పాడిన కొన్ని క్లాసిక్ పాటలతో కూడిన వీడియోను టిక్ టాక్‌లో షేర్ చేసింది.