కూలీలకు పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనులు

by Shyam |
కూలీలకు పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనులు
X

దిశ, రంగారెడ్డి: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు పలు చర్యలు చేపట్టిన రంగారెడ్డి జిల్లా పాలనా యంత్రాంగం కూలీలకు పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనులు కల్పిస్తోంది. బుధవారం జిల్లాలో 28 వేల మంది కూలీలకు పైగా ఉపాధి పనులు కల్పించింది. అయితే, కొన్ని షరతులు కూడా విధించింది. కూలీలు తప్పని సరిగా సోషల్ డిస్టెన్స్ పాటించాలని, మాస్కులు ధరించాలని, చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించింది. అంతేకాకుండా తాగునీటిని ఇంటి వద్ద నుంచి తెచ్చుకోవాలని కోరింది. రంగారెడ్డి జిల్లాలోని 21 మండలాల్లో 28,527 మంది కూలీలు ఉపాధి పనులకు హాజరైనట్టు పాలనా యంత్రాంగం అధికారికంగా వెల్లడించింది.

Tags : labour work, mahathma gandhi, labour, employement scheme, rangareddy



Next Story

Most Viewed