కూతపెట్టిన మెట్రో..

by Shyam |
కూతపెట్టిన మెట్రో..
X

దిశ, వెబ్‌డెస్క్ : అన్‌లాక్ 4.0లో భాగంగా హైదరాబాద్‌లో మెట్రో రైలు సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. తొలిదశలో మియాపుర్ నుంచి ఎల్బీనగర్ మార్గంలో మెట్రో కూతపెట్టగా.. మంగళవారం నుంచి నాగోల్ – రాయదుర్గం మార్గంలో నడవనున్నాయి. బుధవారం నుంచి జేబీఎస్- ఎంజీబీఎస్ మార్గంలో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి.

అయితే, ఇవాళ్టి నుంచి రెండ్రోజుల పాటు ఉదయం 7నుంచి మధ్యాహ్నం 12వరకు, సాయంత్రం 4 నుంచి 7గంటల వరకు మెట్రో రైళ్లు నడవనుండగా.. ఎల్లుండి నుంచి ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు మెట్రోరైళ్లు పరుగులు పెట్టనున్నాయి.

Advertisement

Next Story