- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆన్‌లైన్ విక్రయాలకు పెరుగుతోన్న ఆదరణ..!
దిశ, వెబ్‌డెస్క్ :
ఇండియాలో ఆన్‌లైన్ విక్రయాలకు (Online marketing) వినియోగదారుల నుంచి ఆదరణ పెరుగుతోందని దేశీయ అతిపెద్ద లగ్జరీ కార్ల విక్రయ సంస్థ మెర్సిడెస్ బెంజ్ (Mercidies benz) ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంతోష్ అయ్యర్ (Santhosh ayyar) తెలిపారు. మెర్సిడెస్ బెంజ్ ఈ ఏడాది జూన్-ఆగష్టు మధ్య 500 వాహనాలను ఆన్‌లైన్‌లో విక్రయించినట్టు వెల్లడించింది.
కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో కస్టమర్లు షోరూమ్‌లకు వెళ్లేందుకు ఆసక్తి చూపించని క్రమంలో ప్రతిరోజూ సగటున 5 కార్లను విక్రయించినట్టు కంపెనీ పేర్కొంది. వీటిలో సగానికి పైగా వాహనాలు నేరుగా వినియోగదారుల ఇళ్లకు పంపించగా, మిగిలిన వాటిని కస్టమర్లు షోరూమ్‌లకు వచ్చి అందుకున్నట్టు తెలిపింది. ప్రస్తుతం మొత్తం అమ్మకాల్లో ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ (Online platform) అమ్మకాలు 15 శాతం వాటాను దక్కించుకున్నాయని కంపెనీ పేర్కొంది.
ఆన్‌లైన్ కొనుగోలు విధానం వల్ల షోరూమ్‌లు లేని చిన్న పట్టణాల (Small cities) నుంచి కూడా వినియోగదారులు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని మెర్సిడెస్ బెంజ్ ఇండియా సేల్స్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ అయ్యర్ చెప్పారు. అలాగే, యూజ్‌డ్ కార్లు మొత్తం ఆన్‌లైన్ అమ్మకాల్లో 25-30 శాతం వాటాను దక్కించుకున్నాయని కంపెనీ తెలిపింది. కొవిడ్-19 వ్యాప్తి ఆన్‌లైన్ విక్రయాలకు కలిసొచ్చింది.
ఆన్‌లైన్ అమ్మకాల మోడల్ భవిష్యత్తులో మరింత ఆదరణ పొందుతుందని సంతోష్ అభిప్రాయపడ్డారు. కాగా, కరోనా ప్రభావంతో గత సంవత్సరం కంటే ప్రస్తుత ఏడాది అమ్మకాలు 40 శాతం తగ్గుతాయని (Sales decrease) కంపెనీ అంచనా వేసింది. సంస్థ గతేడాది మొత్తం 13,786 యూనిట్లను విక్రయించింది. దేశంవ్యాప్తంగా మొత్తం లగ్జరీ వాహనాల మార్కెట్ 2019లో 35 వేల యూనిట్లు. ఈ ఏడాది ఇవి 21 వేల నుంచి 22 వేల యూనిట్లకు తగ్గే అవకాశముందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.