మెర్సిడెస్ బెంజ్ కొత్త ప్రతిపాదన ఇదే!

by Anukaran |   ( Updated:2020-12-27 05:19:25.0  )
మెర్సిడెస్ బెంజ్ కొత్త ప్రతిపాదన ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ప్రీమియం కార్ల విభాగం మరింత వృద్ధిని సాధించాలంటే దేశీయంగా లగ్జరీ వాహనాలపై సెస్‌ను తగ్గించాలని ప్రముఖ లగ్జరీ వాహన తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ అభిప్రాయపడింది. 2021లో లగ్జరీ వాహన అమ్మకాల ధోరణి మారుతుందని, డిమాండ్ మరింత పెరిగే అవకాశాలున్నాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. వినియోగదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని భారత్‌లో లగ్జరీ కార్లపై సెస్ తగ్గించడం వల్ల ఈ విభాగం వాల్యుమ్‌ల పరంగా మెరుగైన పరిస్థితులను చూడగలదని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో మార్టిన్ ష్వెంక్ తెలిపారు.

‘ఆటో రంగం దీర్ఘకాలంగా కోరుతున్న పన్నుల విషయంలో స్వల్పకాల విధాన మార్పులను తాము కోరడంలేదు. అయితే, లగ్జరీ ఉత్పత్తులపై విధిస్తున్న అదనపు 20-22 శాతం సెస్‌ను తగ్గించాలని గట్టిగా సిఫారసు చేస్తున్నామని’ ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఈ పన్ను 28 శాతంగా ఉంది. ఆటో పరిశ్రమలో 28 శాతం జీఎస్టీతోనే కొనసాగుతున్నప్పటికీ, ఇది చాలా ఎక్కువే. అదనంగా సెస్‌ను తగ్గించడం వల్ల కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు వీలవుతుంది. దీనివల్ల భారత్‌లో ప్రీమియం, లగ్జరీ వాహనాల విక్రయాలు పెరుగుతాయని వివరించారు.

Advertisement

Next Story