తగ్గిన కలెక్టర్… వైద్యాధికారికి చార్జ్ మెమో

by  |
తగ్గిన కలెక్టర్… వైద్యాధికారికి చార్జ్ మెమో
X

దిశ, వెబ్‌డెస్క్: నరసరావుపేటలో కోవిడ్ సమీక్షలో నాదెండ్ల పీహె‌చ్‌సీ డాక్టర్ సోమ్లానాయక్‌కు కలెక్టర్ శామ్యూల్‌కు వాగ్వివాదం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ డాక్టర్ సోమ్లా నాయక్‌ను అరెస్ట్ చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో పోలీసులు ఆయన్ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కలెక్టర్ తీరుపై వైద్య సిబ్బంది, విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో విడుదల చేశారు. కాగా ఈ విషయంలో కలెక్టర్ తగ్గినట్టు తెలుస్తోంది. శనివారం వివాదంపై వివరణ కోరుతూ… సోమ్లా నాయక్‌కు జిల్లా వైద్యాధికారి చార్జ్ మోమో జారీ చేశారు. ప్రస్తుతం సోమ్లా నాయక్ వ్యక్తిగత సెలవులో ఉన్న విషయం విధితమే.



Next Story