- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
#BeMaara అంటున్న హీరోయిన్స్
దిశ, వెబ్‌డెస్క్: ఎవర్‌గ్రీన్ హీరో ఆర్ మాధవన్, శ్రద్ధా శ్రీనాథ్ నటించిన ‘మార’ ఈ మధ్యే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. మలయాళం సినిమా ‘చార్లీ’ రీమేక్‌గా వచ్చిన ఈ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఆర్ట్ ద్వారా ఎన్ని ఆటంకాలనైనా ఎదుర్కోవచ్చనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా, తనను కూడా చాలా ప్రభావితం చేసిందని తెలిపింది హీరోయిన్ మేఘా ఆకాశ్. కళ అనేది రోజువారి జీవితంలో పేరుకుపోయిన దుమ్మును తొలగిస్తుందని.. సాధారణ ప్రపంచానికి దూరంగా వాస్తవ ప్రపంచంలోకి ప్రవేశించేలా చేసి ఆత్మను ప్రశాంతంగా ఉంచుతుందని చెప్పింది. ‘మార’ సినిమా తనకు నచ్చిన కళ దగ్గరకు చేరుస్తుందని ఎప్పుడూ అనుకోలేదంటూ.. పెయింటింగ్ వేస్తున్న ఫొటోలను షేర్ చేసింది మేఘ. #BeMaara అంటూ సోషల్ మీడియాలో ట్యాగ్ ట్రెండ్ అవుతున్న క్రమంలో ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది.
ఇక ఐశ్వర్య రాజేష్ కూడా #BeMaara హ్యాష్ ట్యాగ్‌ను జోడిస్తూ పోస్ట్ పెట్టింది. వంట చేయడం తనలో మరో కోణాన్ని ఆవిష్కరిస్తుందని.. తన పెదాల మీదకు చిరునవ్వును తీసుకొస్తుందని తెలిపింది. నాలో ఉన్న ఈ వర్షన్‌లో ఎలాంటి ఫిల్టర్ ఉండదని.. పూర్తిగా భావోద్వేగం, ప్రేమతో నిండి ఉంటుందని తెలిపింది. అమెజాన్ ప్రైమ్‌లో ‘మార’ సినిమా చూస్తున్న క్రమంలో ఈ జ్ఞాపకాలను తిరిగిపొందగలిగాను అంటూ కుకింగ్ పిక్స్ షేర్ చేసింది ఐశ్వర్య.
ఇక బాలీవుడ్ హీరోయిన్ దియా మీర్జా కూడా ‘మార’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది. ఏదో ఒక రోజు హీరో మాధవన్‌తో కలిసి ఉండాలనుకుంటున్నాను అని తెలిపింది. దీనిపై స్పందించిన మ్యాడీ.. మీరు అలా నాతో ఉండే సమయం కోసం వెయిట్ చేస్తున్నాను అంటూ రిప్లై ఇచ్చాడు.
"Art washes away the dust of everyday life". It liberates my soul & makes me get into my real world far away from the existing normal one. Never imagined #MaaraOnPrime would take me back to the same space. #BeMaara @PrimeVideoIN pic.twitter.com/9hflryl7eG
— Megha Akash (@akash_megha) January 9, 2021