- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తుమ్మాలన్నా.. దగ్గాలన్నా భయమేస్తోంది
దిశ, క్రైమ్ బ్యూరో: కరోనా వ్యాప్తి సమయంలో నలుగురిలో దగ్గాలన్నా.. తుమ్మాలన్నా భయమేస్తోందని మెగాస్టర్ చిరంజీవి అన్నారు. ఇంట్లో భార్యాభర్తల మధ్య కూడా భౌతిక దూరం ఉండాల్సిన పరిస్థితులను కరోనా సృష్టించిందన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ప్లాస్మా దాతలకు శుక్రవారం నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా ఇంట్లో నలుగురు పని మనుషులకు కరోనా పాజిటివ్ వస్తే.. వారిని వెంటనే ఇంటి నుంచి బయటకు పంపించి, ప్రత్యేకంగా ఇల్లు తీసుకుని క్వారంటైన్ ఏర్పాటు చేశామన్నారు.
వాళ్ళకు భోజనం అందించేటప్పుడు ప్లేట్‌ను విసిరేయాల్సి వచ్చిందన్నారు. ఇంట్లో సురేఖ (భార్య) పై సాధారణంగా చేయి వేసినా అదోలా చూస్తోందన్నారు. అలా చూసినప్పుడు ఓహో కరోనా కదా.. అని గుర్తుకొస్తొందని చమత్కారంగా చెప్పారు. చిరు మాట్లాడుతుండగా.. రెండు సార్లు దగ్గడంతో నలుగురిలో దగ్గాలన్నా.. తుమ్మాలన్నా భయం వేస్తోందన్నారు. కరోనా పేరు చెబితేనే భయం వైఫైలా చుట్టకున్నట్టు ప్రజలంతా ఆందోళన చెందుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం కరోనాను ఎదుర్కొనే విషయంలో మానవత్వాన్ని చాటుకుంటున్న వారికి సైంటిస్టులకు మధ్య పోటీ జరుగుతోందని అన్నారు. ఈ పోటీలో మానవతావాదులే గెలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం కరోనా నుంచి భయటపడాలంటే ఒకే ఒక్క వెపన్ ప్మాస్మా మాత్రమేనని అన్నారు. ఈ ప్లాస్మా కరోనా రోగులకు సంజీవినీ లాగా పనిచేస్తోందని అన్నారు. అయితే, ప్లాస్మా ప్రచార కార్యక్రమాలలో సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తనను వెపన్‌లా వాడుకోవాలని సూచించారు. కానీ, సజ్జనార్ గారి దగ్గర వెపన్ గురించి మాట్లాడాలంటేనే భయం వేస్తోందని నవ్వులు పూయించారు. ప్లాస్మా డొనేషన్ చేయడం ద్వారా ముగ్గురు కరోనా పేషెంట్లు కోలుకుంటారని అన్నారు. ప్లాస్మాను దానం చేసిన వారే సమాజంలో నిజమైన హీరోలుగా, స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ఒక యుద్దంలా, నిరంతరం కొనసాగించాలని కోరారు. కరోనా వచ్చిందనే భయానికి మనస్తాపం చెందుతూ చనిపోతున్నారనే వార్తలు వింటుంటే చాలా బాధేస్తోందని అన్నారు.
మా పని మనుషులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా, ప్లాస్మా దానం చేయాలని విన్నవించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ కరోనా నుంచి కోలుకున్న కొందరు భవిష్యతులో మా కుటుంబ సభ్యులెవరికైనా ప్లాస్మా అవసరమైతే ఎలా అనే సందేహంలో చాలా మంది ఉన్నారన్నారు. అయితే, ప్లాస్మా దానం చేయాలంటే కచ్చితంగా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కావాలన్నారు. ఒకవేళ మీ కుటుంబ సభ్యులకు ప్లాస్మా అవసరం వస్తే.. మీకు ముందు వరుసలో ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ సందర్భంగా ప్లాస్మా డొనేషన్ వారికి చిరంజీవి చేతులమీదుగా సత్కరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్ కుమార్, శంషాబాద్, బాలానగర్ డీసీపీలు ఎన్ ప్రకాశ్ రెడ్డి, పద్మజా, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి కృష్ణ, అడిషనల్ డీసీపీలు మాణిక్ రాజ్, వెంకటరెడ్డి, ప్రవీణ్ కుమార్, గౌస్ మొహియుద్దీన్, డాక్టర్ సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.