- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
chiranjeevi: నాగబాబు మరణం నన్ను ఎంతగానో బాధిస్తుంది- చిరంజీవి
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులను ఎంత ప్రేమిస్తారో అందరికి తెలిసిందే. వారు బాధల్లో, కష్టాల్లో ఉన్నారని తెలిసిన వెంటనే తడుముకోకుండా సాయం చేస్తుంటారు. ఇక తమ అభిమానులు ఎవరైనా మృతిచెందిన తన సంతాపాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ వారి కుటుంబానికి అండగా నిలుస్తారు. తాజాగా చిరు తనకు ఎంతో ఇష్టమైన అభిమానిని కోల్పోయారు. అభిమాని మరణ వార్త వినగానే చిరు భావోద్వేగానికి లోనయ్యారు. యర్రా నాగబాబు చిరుకు వీరాభిమాని. చిరు స్ఫూర్తితోనే కోనసీమలో ఐ బ్యాంక్ ఏర్పాటు చేసి చూపు లేని ఎంతో మందికి న
గబాబు కంటి చూపును ప్రసాదించారు. అతని సేవలను గుర్తించిన చిరంజీవి ఆయనను కలిసి అభినందించారు. అయితే నాగబాబు గత కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడడంతో అతనిని కాకినాడలోని ఓ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా చిరు నాగబాబుకు ఫోన్ చేసి భరోసా ఇచ్చారు.
ఇక ఇటీవలే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగబాబు కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న చిరు ఎమోషనల్ అయ్యారు. ” నాగబాబు లాంటి మంచి వ్యక్తిని కోల్పోవడం చాలాబాధాకరం.. కొద్ది రోజుల క్రితం అతనితో మాట్లాడినప్పుడు చాలా ధైర్యంగా ఉన్నారు. కాని ఇలా కరోనాతో మరణించడం బాధగా ఉంది. అతడి కుటుంబ సభ్యులకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. సారీ నాగబాబు, మిస్ యూ ” అంటూ చిరంజీవి సంతాపం తెలిపారు.