ప్లాస్మా డోనర్స్‌కు మెగాస్టార్ సన్మానం

by  |
ప్లాస్మా డోనర్స్‌కు మెగాస్టార్ సన్మానం
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్లాస్మాథెరపి మెరుగైన ఫలితాలను అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చాయి. పలు రాష్ట్ర ప్రభుత్వాలు దానం చేసిన వారికి నగదును కూడా అందజేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ పోలీసులు ప్లాస్మా దానం చేసేందుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

అయితే, డోనర్స్‌కు శుక్రవారం సైబరాబాద్ కమిషనరేట్‌లో సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి 150 మంది డోనర్స్‌ను సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్లాస్మా దానం చేస్తున్న వారికి అభినందనలు తెలుపుతున్నానని చెప్పారు. కరోనా సమయంలో పోరాడుతున్న పోలీసులు, డాక్టర్లు, పారిశుధ్య కార్మికులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

గతంలో రక్తదానం చేసేందుకు అభిమానులను ప్రోత్సహించానని గుర్తు చేసుకున్న చిరంజీవి.. అది ఇప్పటికీ కొనసాగుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే బెస్ట్ బ్లడ్ బ్యాంక్ అవార్డు పొందడం తనకు ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. ప్లాస్మా అనేది గొప్ప సంజీవని అంటూ చిరు అభివర్ణించారు. కరోనా పేషంట్లను కాపాడుకునేందుకు వ్యాధి నుంచి కోలుకున్న ప్రతీ ఒక్కరు ప్లాస్మా దానం చేయాలని మెగాస్టార్ పిలుపునిచ్చారు.


Next Story

Most Viewed