- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొవిడ్ రోగులకు సాయం చేసే ‘గ్రేస్’ రోబోట్
దిశ, ఫీచర్స్ : పాండమిక్ టైమ్ మొదలైనప్పటి నుంచి హెల్త్‌కేర్ వర్కర్స్ అలుపెరగకుండా పనిచేస్తున్న విషయం తెలిసిందే. విధుల్లో భాగంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ అలసటకు గురవుతున్న నేపథ్యంలో ఫ్రంట్‌లైన్ హాస్పిటల్ సిబ్బందిపై భారం తగ్గించడానికి హాంకాంగ్ బృందం ‘గ్రేస్’ అనే హ్యూమనాయిడ్ రోబోట్‌ను తయారు చేసింది. హెల్త్‌కేర్ ప్రొఫెషనల్‌ను పోలి ఉండే ఈ రోబోట్.. ఆస్పత్రిలో, హోం ఐసోలేషన్‌లో ఉన్న వృద్ధులతో పాటు కొవిడ్ -19 రోగులకు సాయం చేయనుంది.
హ్యూమనాయిడ్ రోబోట్ ‘సోఫియా’ను రూపొందించిన హాన్సన్ రోబోటిక్స్‌కు చెందిన బృందమే ‘గ్రేస్’ను కూడా తయారుచేసింది. కాగా దీని చాతి భాగంలో అమర్చిన థర్మల్ కెమెరా.. బాడీ టెంపరేచర్ చెక్ చేయడం ద్వారా బాధితుల ఆరోగ్యాన్ని కనుగొంటుంది. కృత్రిమ మేధస్సు ద్వారా రోగి సమస్యను అర్థం చేసుకునే రోబో.. హార్ట్‌బీట్, బాడీ రెస్పాన్సెస్‌తో పాటు బయో రీడింగులను తీసుకొని ఆ రిపోర్ట్‌ను గ్రేస్ వైద్యులకు అందిస్తుంది. కరోనా సమయంలో బాధితులను క్షేమంగా చూసుకునే బాధ్యతతో పాటు వారితో ఇంగ్లీష్, మాండరిన్, కాంటోనీస్ భాషల్లో మాట్లాడుతుంది. వ్యాయామ టిప్స్ అందించడమే కాక ఎంటర్‌టైన్ కూడా చేస్తుంది. కాగా హాన్సన్ రోబోటిక్స్, సింగులారిటీ స్టూడియోల జాయింట్ వెంచర్ ‘అవేకెనింగ్ హెల్త్’ ప్రొడక్ట్‌గా గ్రేస్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఇక హ్యూమనాయిడ్ రోబోట్ సోఫియాకు 2017లో సాధారణ ప్రజల వలె పౌరసత్వం లభించిన విషయం తెలిసిందే.
ఆగస్టు నాటికి గ్రేస్ బీటా వెర్షన్‌ను భారీగా ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. వచ్చే ఏడాది నాటికి హాంకాంగ్‌తో పాటు చైనా, జపాన్, కొరియాలో పలు ఆస్పత్రులకు వీటిని అందించనున్నాం. ఈ రోబోట్ కరోనా రోగులను నర్సులాగే చూసుకుంటుంది. దీనివలన ఆరోగ్య కార్యకర్తలకు ఐసోలేషన్ లోపల ఉండే పరిస్థితి తప్పుతుంది. తద్వారా వారు కరోనా బారిన పడే అవకాశం తగ్గుతుంది. మనుషుల్లానే మాట్లాడే గ్రేస్.. 48 కంటే ఎక్కువ ముఖ కవళికలను ప్రదర్శించగలదు. అయితే హెల్త్‌కేర్ సెట్టింగ్‌లో ప్రొఫెషనల్‌గా కనిపించడానికే మేము గ్రేస్‌ను రూపొందించాం. మానవ-రూపాన్ని పోలి ఉండటం వల్ల రోగికి కూడా అదో మెషిన్ అనే భావన కలగదు, నమ్మకం ఏర్పడుతుంది. వందలు లేదా వేల సంఖ్యలో వీటిని ఉత్పత్తి చేయడంతో రోబోట్ల ధర చాలా వరకు తగ్గుతుంది.
– డేవిడ్ హాన్సన్, హన్సన్ సీఈవో, ఫౌండర్, రోబోటిక్స్ డిజైనర్