- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రఫేల్ నదాల్‌కు షాకిచ్చిన మెద్వెదేవ్
దిశ, స్పోర్ట్స్ : ఏటీపీ 2020 ఫైనల్స్ టూర్‌లో వరల్డ్ నెంబర్ 2 రఫేల్ నదాల్‌కు వరల్డ్ నెంబర్ 4 ర్యాంకర్ డానిల్ మెద్వెదేవ్ షాకిచ్చాడు. సీజన్‌లో చివరి టూర్ టోర్నీ అయిన ఏటీపీ టూర్ సెమీఫైనల్స్ ఆదివారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) లండన్‌లోని ఓ2 ఎరేనాలో నదాల్, మెద్వెదేవ్ మధ్య జరిగింది. ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచిన నదాల్ సెమీస్‌లో తొలుత అదే జోరు కొనసాగించాడు. కానీ రెండో సెట్ నుంచి మెద్వెదేవ్ పుంజుకున్నాడు.
నదాల్‌ను ముప్పతిప్పలు పెట్టి మ్యాచ్‌ను తనవైపునకు తిప్పుకున్నాడు. దీంతో చివరికి మెద్వెదేవ్ 3-6, 7-6(7/4), 6-3 తేడాతో నదాల్‌పై విజయం సాధించి ఫైనల్‌లో ప్రవేశించాడు. ఏటీపీ టూర్ ఫైనల్స్‌లో మెద్వెదేవ్, డోమినిక్ థీమ్ తలపడనున్నారు. ఏటీపీ ఫైనల్స్ అంటే ఏడాది చివరిలో టాప్ ర్యాంకర్లైన మెన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్ మధ్య జరిగే టోర్నీ. కరోనా కారణంగా ప్రస్తుతం లండన్‌లో ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తున్నారు.