ఒత్తిడిని తగ్గించే.. ‘మెడిటేషన్ యాప్స్’

by Harish |
ఒత్తిడిని తగ్గించే.. ‘మెడిటేషన్ యాప్స్’
X

దిశ, వెబ్‌డెస్క్ : ఓవైపు కరోనా కలవరపెడుతుంటే.. మరోవైపు వర్క్ స్ట్రెస్, ఇంకో వైపు ఇంటి బాధ్యతలు ఆందోళన, ఒత్తిడిని పెంచుతుంటాయి. సమన్వయ లోపం, ఇన్‌స్టంట్ ఫుడ్, వేళపాల లేని జాబ్స్ లేదా ఇతరత్రా కారణాలు ఈ సమస్యను రెట్టింపు చేస్తున్నాయి. ఆరోగ్యంగా ఉండాలన్నా, రోజంతా ఉత్సాహంగా గడపాలన్నా.. ‘మెంటల్ హెల్త్’ అనేది చాలా ఇంపార్టెంట్. మానసికంగా ఆరోగ్యంగా లేకపోతే నిద్ర సరిగా పట్టదు, పని మీద కూడా ఫోకస్ చేయలేం. అయితే ఈ తరహా ఒత్తిడిని తగ్గించుకునేందుకు టీవీ, ఎంటర్‌టైన్మెంట్, వీడియో కాలింగ్ యాప్స్‌తో పాటు మెడిటేషన్, వెల్‌నెస్ యాప్స్ ఉపయోగపడుతున్నాయి. ఈ యాప్స్ ద్వారా అందించే సలహాలు, సూచనలు పాటిస్తే.. అంతా కామ్‌డౌన్ అయిపోయే అవకాశం ఉంది.

హెడ్‌ ‌స్పేస్ :

ఇది పాపులర్ మెడిటేషన్ యాప్. ఆండ్రాయిడ్, ఐవోఎస్ డివైజ్‌లకు అందుబాటులో ఉంది. ఇందులో మైండ్‌ఫుల్‌నెస్, మెడిటేషన్‌లకు సంబంధించిన బేసిక్స్ చెబుతారు. అంతేకాదు నిద్రపట్టడానికి టిప్స్ అందించడంతో పాటు యాప్‌లోని సౌండ్‌ట్రాక్స్ లైబ్రరీ మంచి నిద్రకోసం మెలోడి సంగీతాన్ని అందిస్తుంది. స్ట్రెస్, స్లీప్, యాంగ్జయిటీ, ఫిజికల్ హెల్త్, పర్సనల్ గ్రోత్ తదితర అంశాల మీద లిమిటెడ్ ఫ్రీ మెటిరీయల్ అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయా అంశాల మీద బేసిక్స్ నాలెడ్జ్ అందిస్తాయి. అంతకుమించి నేర్చుకోవాలనుకుంటే.. ‘హెడ్‌స్పేస్ ప్లస్’ పెయిడ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.

ది మైండ్‌ఫుల్‌నెస్ యాప్ :

ఆండ్రాయిడ్, ఐవోస్ యూజర్లకు అందుబాటులో ఉన్న ఈ యాప్.. మైండ్‌ఫుల్‌నెస్, మెడిటేషన్ సెషన్స్‌కు సంబంధించి 5 రోజుల పాటు ఇంట్రడక్షన్ క్లాసులు అందిస్తోంది. కాగా ఇది పూర్తిగా ఉచితం. అయితే బేసిక్స్‌ను మించి మెడిటేషన్ క్లాసులు కావాలనుకుంటే పెయిడ్ వెర్షన్ కూడా ఉంది. అందులో పాపులర్ టీచర్స్ క్లాసులు అందిస్తారు. స్ట్రెస్ రిలీఫ్, ఫోకస్, స్లీప్, ఎమోషన్స్, చిల్డ్రన్ అండ్ టీన్స్, మైండ్‌ఫుల్‌నెస్ ఎట్ వర్క్, రిలేషన్‌షిప్స్ ఇలా రకరకాల టాపిక్స్‌పై క్లాసులు ఉండటం విశేషం.

కామ్ :

చాలా పాపులర్, అవార్డ్ విన్నింగ్ ‘మెడిటేషన్ & వెల్‌నెస్’ యాప్ ఇది. ఆండ్రాయిడ్, ఐవోస్ యూజర్లు దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కామింగ్ ఎక్సర్‌సైజెస్, బ్రీతింగ్ టెక్నిక్స్, రిలాక్సింగ్ థెరపీ వంటి అంశాలకు సంబంధించిన వీడియో సెషన్స్ కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో రాత్రుళ్లు నిద్రపట్టడం లేదనే వాళ్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఒకప్పుడు వృద్ధుల్లోనే ఈ సమస్య ఉండేది. ఇప్పుడు టీనేజర్స్‌ను కూడా ఈ సమస్య వెంటాడుతోంది. అందుకే హాయిగా నిద్ర పోయేందుకు ‘స్లీప్ స్టోరీస్ సెక్షన్’ ఉండటం ఈ యాప్ ప్రత్యేకత. లిమిటెడ్ అంశాలను ఈ యాప్‌ ఉచితంగానే అందిస్తుండగా.. పెయిడ్ వెర్షన్‌ కూడా అందుబాటులో ఉంది.

సత్వ :

ఇది కూడా మంచి ఆదరణ ఉన్న యాప్. వేదిక్ ప్రిన్సిపుల్స్ అనుసరించి ఇందులో మెడిటేషన్ క్లాసులు చెబుతారు. మెడిటేషన్ మ్యూజిక్, టైమర్, ట్రాకర్ వంటి ఫీచర్స్ ఈ ప్రత్యేకతలు.

సెరెనిటీ :

‌జీవితంలో శాంతితో పాటు కామ్‌‌నెస్ అందించడానికి ఈ యాప్‌లో ప్రత్యేక క్లాసులు ఉండటం విశేషం. మొదటి ఏడు రోజులు పూర్తిగా ఉచిత క్లాసులు అందిస్తారు. మెడిటేషన్, మైండ్‌పుల్‌నెస్‌ సెషన్స్‌తో పాటు స్లీప్, రిలాక్సేషన్ టెక్నిక్స్ చెబుతారు.

Advertisement

Next Story

Most Viewed