అవ‌మానంగా భావిస్తున్నాం..

by Shyam |
అవ‌మానంగా భావిస్తున్నాం..
X

దిశ ప్ర‌తినిధి, హైద‌రాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జరిగిన ఉద్యోగ సంఘాల భేటీలో వైద్యులు, వైద్య ఉద్యోగ సంఘాలను ఆహ్వానించక పోవడం అవమానంగా భావిస్తున్నట్టు తెలంగాణ మెడికల్, పబ్లిక్ హెల్త్ జేఏసీ తెలిపింది. ఈ మేర‌కు జేఏసీ చైర్మ‌న్ డాక్ట‌ర్ వీ.ర‌విశంక‌ర్, క‌న్వీన‌ర్ క‌ర్నాటి సాయిరెడ్డి త‌దిత‌ర ప్ర‌తినిధుల బృందం గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో వైద్యులు, వైద్య ఉద్యోగులు పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కీలక పాత్ర పోషించారని అన్నారు. రాష్ట్ర సాధన అనంతరం వైద్య ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదని స్పష్టం చేశారు. చర్చలు జరపడానికి మేము అనర్హులమా అనే సందేహం అంద‌రినీ బాధ‌కు గురి చేస్తుంద‌న్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ పునరాలోచించి వైద్యులను, వైద్య ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవాలని కోరుతున్న‌ట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story