కేశవాపూర్‌లో మేడ్చల్ కలెక్టర్

by Shyam |
కేశవాపూర్‌లో మేడ్చల్ కలెక్టర్
X

దిశ, హైదరాబాద్ : తాగునీటి సమస్యలు తీర్చేందుకు నిర్మించ తలపెట్టిన కేశవాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు స్థలాన్ని గురువారం మేడ్చల్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కేశవాపూర్ రిజర్వాయర్ మొత్తం 1859 ఎకరాల విస్తీర్ణంలో, 5 టీఎంసీల కెపాసిటీతో నిర్మించనున్నట్టు తెలిపారు. ఈ రిజర్వాయర్ పూర్తయితే స్థానిక ప్రజల నీటి అవసరాలు తొలగిపోతాయని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజర్వాయర్ ప్లాన్‌ను పరిశీలించారు. కీసర ఆర్డీవో రవి, భూ సర్వే అధికారి రామచంద్రం, శామీర్ పేట తహసీల్దార్ గోవర్థన్, అధికారులు పాల్గొన్నారు.

Tags: collecter visit, keshavapur,resorvoir, venkateshwarlu, mdlc, waterboard

Advertisement

Next Story

Most Viewed