- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రాష్ట్రస్థాయి టెన్నికాయిట్ పోటీలకు మెదక్ జట్టు
by Shyam |

X
అండర్-17 బాలుర బాలికల విభాగానికి సంబంధించిన ఉమ్మడి మెదక్ జిల్లా టెన్నికాయిట్ జట్టు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు సిద్దిపేట నుంచి ఇవాళ బయల్దేరింది. పోటీలు మహబూబ్‌నగర్ జిల్లాలో ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా జట్టు సభ్యులకు మెదక్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి భిక్షపతి పలు సూచనలు చేశారు. జిల్లాకు మంచి పేరు తీసుకురావాలనీ, జాతీయస్థాయికి ఎంపికవ్వాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ జట్టుకు కోచ్‌లుగా అనంతచారి, ప్రవీణ్ వ్యవహరించనున్నారు. క్రీడాకారులకు సిద్దిపేట జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ అధ్యక్షులు ఫక్రుద్దీన్ రూ.1000 ఆర్థిక సహాయాన్ని అందించారు.
Next Story