జనతా కర్ఫ్యూకు చర్యలు : సీఎస్

by sudharani |   ( Updated:2020-03-21 04:44:10.0  )
జనతా కర్ఫ్యూకు చర్యలు : సీఎస్
X

దిశ, నిజామాబాద్: ప్రధాని మోడీ పిలుపు మేరకు ఆదివారం జనతా కర్ఫ్యూకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశించారు. శనివారం ఆయన సంబంధిత పోలీసు వైద్య శాఖకు చెందిన రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి జిల్లాల కలెక్టర్లు పోలీస్ అధికారులతో కరోనా వైరస్‌పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనతా కర్ఫ్యూకు ప్రభుత్వ యంత్రాంగం తరపున అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వీయ నిర్బంధం ఉండే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. చెక్‌పోస్టుల వద్ద అవసరమైన చెకింగ్ నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరూ కనీస దూరం పాటించే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్యక్రమాలకు, మీడియా కవరేజ్‌కి మినహాయింపు ఇవ్వాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ 986మంది విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వచ్చిన వారందరినీ ఐసోలేషన్‌లో ఉంచామని అన్నారు. జిల్లాలో ఐదు చెక్‌పోస్ట్‌లు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించి చెక్ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేవని తెలిపారు.

సీపీ కార్తికేయ మాట్లాడుతూ జిల్లా సరిహద్దుల్లో గల చెక్‌పోస్టుల నుంచి వచ్చే అన్ని వాహనాలను చెక్ చేస్తున్నామని ఫంక్షన్‌హాల్స్ మూసి ఉంచామని తెలిపారు. అన్ని కమ్యూనిటీల వారికి సమావేశం ఏర్పాటు చేసి అవసరమైన సూచనలు చేశామన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రసారమయ్యే అసత్య వార్తలపై చర్యలు తీసుకుంటామన్నారు. సూపర్ మార్కెట్లు, షాపింగ్‌మాల్స్‌కు వచ్చే ప్రజలకు కనీస దూరం పాటించే విధంగా అవగాహన కల్పించవలసిందిగా ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌‌లో అదనపు డీసీపీ రఘువీర్, ఉషా విశ్వనాథ్, డీటీసీ వెంకటరమణ, డీఎంహెచ్‌వో సుదర్శనం, ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

tags : Measures, Janata curfew, telangana CS, coronavirus, collector, nizamabad, Checkpost, Video Conference

Advertisement

Next Story

Most Viewed