- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మల్కాజిగిరిలో అభివృద్ధి పనులు పరిశీలించిన మేయర్
by Shyam |
X
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రస్తుతమున్న కార్మికులకు అదనంగా ఎక్కువమందిని కలుపుకుని ఏకకాలంలో అభివృద్ధి పనులు కొనసాగించాలని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ సూచించారు. పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు జీహెచ్ఎంసీ అండగా నిలుస్తుందని హామీనిచ్చారు. మల్కాజిగిరి ఈస్ట్ ఆనంద్‌బాగ్‌లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన గురువారం పరిశీలించారు. వరద నీటితో ఈస్ట్ ఆనంద్ బాగ్‌లోని పలు కాలనీలు ముంపునకు గురవుతున్నాయని, సమస్యకు శాశ్వత పరిష్కారంగా నాలా మళ్లింపు, విస్తరణ చర్యలు చేపడుతున్నట్టు మేయర్ ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం ఈస్ట్ ఆనంద్‌బాగ్‌లో రూ.40 కోట్లతో చేపట్టిన రైల్వే అండర్ బ్రిడ్జి, రోడ్డు విస్తరణ పనులను తనిఖీల చేశారు. ఆయనతో పాటు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జెడ్‌సి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.
Advertisement
Next Story