- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేయర్‌కు మరోసారి కరోనా టెస్టు
దిశ, న్యూస్ బ్యూరో: హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌కు మరోసారి కరోనా నిర్దారణ పరీక్ష జరిగింది. నాలుగు రోజుల కిందట చేయించుకున్న టెస్టులో రిపోర్టు నెగిటివ్ వచ్చింది. అయితే తాజాగా ఆయన కారు డ్రైవర్‌కు పాజిటివ్ రావడంతో ప్రైమరీ కాంటాక్టుగా ఉన్నందున మేయర్‌కు మళ్ళీ శుక్రవారం పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. రిపోర్టు ఈ రాత్రికిగానీ, శనివారం ఉదయం గానీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఆయన క్వారంటైన్‌లోకి వెళ్ళిపోయారు. లక్షణాలు ఉంటే తప్ప కరోనా పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ నిర్దిష్టమైన మార్గదర్శకాలను రూపొందించగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటినే అనుసరిస్తూ ఉంది. అందువల్లనే లక్షణాలు బహిర్గతమైతేనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తామన్న విధాన నిర్ణయం తీసుకుంది.
అయితే మేయర్ విషయంలో మాత్రం ఆ నిబంధనను తుంగలో తొక్కి..రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వారం రోజుల వ్యవధిలోనే రెండుసార్లు పరీక్షలు చేశారు. ఇప్పటికే జీహెచ్ఎంసీలో ప్రజారోగ్య విభాగం, పారిశుధ్య విభాగాల్లో పనిచేసే పలువురుకి పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ఏకంగా మేయర్‌కే సోకిందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాగూ క్వారంటైన్‌లోనే ఉన్నందున రిపోర్టు వచ్చిన తర్వాత దీనిపై మరింత స్పష్టత రానుంది.