కొవిడ్ వైరస్ కణాలన్నీ.. కోకాకోలా టిన్‌లోనే

by  |
కొవిడ్ వైరస్ కణాలన్నీ.. కోకాకోలా టిన్‌లోనే
X

దిశ, ఫీచర్స్ : ఏడాది కాలంగా కొవిడ్ మహమ్మారి జనాలను కలవరపెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 109,106,464 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్ కారణంగా 2,405,463 మంది చనిపోయారు. ఈ లెక్కన ప్రపంచంలోని ప్రతి సార్స్ కోవి -2 వైరస్ కణాన్ని సేకరిస్తే.. ఎంత మొత్తం అవుతుంది? చెప్పడం కష్టం అంటారా? లేదా ఓ చెరువంతా ఉండొచ్చని అంటారా? అయితే ఇదే ప్రశ్నకు బాత్ యూనివర్సిటీ గణిత శాస్త్రజ్ఞుడు క్రిస్టియన్ యేట్స్ ఏం చెప్పాడో తెలుసా? లెక్కల్లో ఘనుడు కాబట్టి ఏవో లెక్కలు కట్టేసి.. కరోనా వైరస్ కణాలన్నిటినీ ఓ దగ్గరకు చేరిస్తే అవి కోకాకోలా టిన్‌లో ఇమిడిపోతాయని తెలిపాడు.

క్రిస్టియన్ యేట్స్ తన పుస్తకం ‘మ్యాథ్స్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్’ కోసం ఇలాంటి లార్జ్ స్కేల్ ఎన్వలప్ ఎస్టిమేషన్స్ ఇదివరకే చేశాడు. ఈ క్రమంలోనే ప్రపంచంలో ప్రస్తుతం ఉనికిలో ఉన్న కరోనా వైరస్ కణాలన్నింటినీ ఓ దగ్గరకు చేరిస్తే.. అవి చాలా సులువుగా 330 ఎమ్‌ఎల్ కోకాకోలా క్యాన్‌లో ఇమిడిపోతాయని, ఆ క్యాన్‌లో మరి‌కొంత ఖాళీ కూడా ఉంటుందని లెక్కల్లో ఘనాపాఠి అయిన యేట్స్ వివరించాడు. ప్రపంచంలో ప్రతిరోజు సగటున ఎన్ని కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి, వ్యక్తుల శరీరాల్లో వైరస్ కణాల సంఖ్య ఎంత ఉంటుంది అనే అంశాల ఆధారంగా ఆయన ఈ లెక్క గట్టారు. మోస్ట్ రీజనబుల్ అసంప్షన్స్‌తో ఓ అంచనాకు వచ్చినట్లు ఆయన చెప్పాడు.

అయితే ప్రపంచంలో ఎన్ని సార్స్ కొవిడ్ 2 కణాలు ఉన్నాయో లెక్కించడానికి ముందు ఎంత మందికి కరోనా వ్యాధి సోకిందో తెలుసుకోవాలని ఆయన అంటున్నాడు. ‘అవర్ వరల్డ్ ఇన్ డేటా’ వెబ్‌సైట్ ప్రకారం, ప్రతిరోజూ హాఫ్ మిలియన్ల మంది కొవిడ్‌ పాజిటివ్‌కు గురవుతున్నారు. కొంతమంది లక్షణాలు బయటకు కనిపించక టెస్ట్ చేయించుకోవడం లేదు, కొన్ని దేశాల్లో విస్తృతమైన పరీక్షలు అందుబాటులో లేనందున ఇప్పటికీ చాలా మంది ఈ లెక్కలో చేర్చడం లేదు. ఈ లెక్కలను కూడా పరిగణనలోకి తీసుకోవడంతో పాటు స్టాటిస్టికల్ అండ్ ఎపిడెమియోలాజికల్ మోడలింగ్ ఉపయోగించి, ప్రతిరోజు 3 మిలియన్ల మంది వాస్తవంగా కొవిడ్ బారిన పడుతున్నట్లు ఇన్సిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్స్ అంచనా వేసింది. ఈ గణాంకాల ప్రకారం సుమారు 200 క్వాడ్రిలియన్ లేదా వంద మిలియన్ బిలియన్ల వైరస్ కణాలు ఏ సమయంలోనైనా ప్రపంచంలో ఉన్నట్లు యేట్స్ అంచనా వేశాడు. 50-నానోమీటర్ వ్యాసార్థంతో ఓ కొవిడ్ కణం ఉంటుందనుకుంటే, ఆ సింగిల్ స్పెరికల్ వైరస్ వ్యాల్యూమ్ 523,000 క్యూబిక్ నానోమీటర్లు ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed