టోకనైజేషన్‌ను విడుదల చేసిన మాస్టర్ కార్డు, గూగుల్!

by Harish |   ( Updated:2021-12-21 04:54:23.0  )
Mastercard
X

దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ లావాదేవీల్లో డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా సురక్షితంగా లావాదేవీలు నిర్వహించేందుకు మాస్టర్ కార్డు, గూగుల్ సంయుక్తంగా టోకనైజేషన్‌ను మంగళవారం విడుదల చేశాయి. దీని ద్వారా వినియోగదారులు తమ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వివరాలను అంటే కార్డు నంబర్, ఎక్స్‌పైరీ తేదీ లాంటివి చెప్పకుండా భద్రత కలిగిన టోకెన్ చెల్లింపులు చేయవచ్చని ఇరు సంస్థలు ప్రకటించాయి. దేశీయంగా ఆన్‌లైన్ లావాదేవీలను ఎక్కువ సురక్షితంగా జరిపేందుకు వీలుగా భారత చెల్లింపుల కార్పొరేషన్ ఎన్‌పీసీఐ ఈ టోకనైజేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. గూగుల్ పే ఆండ్రాయిడ్ వినియోగదారులు తమ మాస్టర్ కార్డు డెబిట్, క్రెడిట్ కార్డుల నుంచి భారత్ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం, యాప్‌ల నుంచి లావాదేవీలను నిర్వహించడానికి ఇది ఎంతో సురక్షితంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. దీనికోసం వినియోగదారులు గూగుల్ యాప్‌లో తమ కార్డు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని కంపెనీ వివరించింది. కార్డు పోవడం, ఎక్స్‌పైరీ తేదీ ముగిసిన సమయాల్లో వినియోగదారులు టోకెన్‌ను అప్‌డేట్ చేసుకునే వీలుంటుంది.

Advertisement

Next Story