అందరినీ మెప్పించే ‘మాస్టర్’ పీస్ : లోకేశ్ కనకరాజ్

by Shyam |
అందరినీ మెప్పించే ‘మాస్టర్’ పీస్ : లోకేశ్ కనకరాజ్
X

దిశ, వెబ్‌డెస్క్ : ‘మాస్టర్’ తెలుగు వర్షన్ ఆడియో లాంచింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్, నటుడు శంతన్ భాగ్యరాజ్, మహేశ్ కోనేరు హాజరు కాగా.. ‘మాస్టర్’ బిగ్ సీడీని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా మాట్లాడిన డైరెక్టర్.. మాస్టర్ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న మహేశ్ కోనేరుకు అభినందనలు తెలిపారు. సినిమాను సెలబ్రేట్ చేసుకునే తెలుగు ప్రేక్షకులు మాస్టర్‌ను ఆదరిస్తారని ఆశించిన డైరెక్టర్.. ఈ చిత్రం అన్ని వర్గాలకు మంచి ట్రీట్‌లా ఉంటుందన్నారు. హీరో విజయ్, విజయ్ సేతుపతి, నిర్మాత బ్రిట్టో, అనిరుధ్‌కు ఈ సందర్భంగా స్పెషల్ థాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన సంగీత దర్శకులు అనిరుధ్ రవిచంద్రన్‌.. అనంత్‌ శ్రీరామ్‌, కృష్ణకాంత్‌, సింగర్‌ శ్రీకృష్ణ, మాలిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మాస్, క్లాస్ మిక్స్ అయిన సినిమా ప్రతీ ఒక్కరిని ఆలోచింపజేస్తుందని అన్నారు. థియేటర్స్‌లో సినిమాను సెలబ్రేట్‌ చేసుకుంటారనడంలో సందేహం లేదన్నారు.

Advertisement

Next Story