నల్లబండగూడెంలో రోడ్డు ప్రమాదం..!

దిశ, కోదాడ:

సూర్యాపేట జిల్లా నల్లబండగూడెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి డివైడర్‎ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లాలోని తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన ఇనపనుర్తి వెంకటేష్, అనిల్.. శుభకార్యం నిమిత్తం కోదాడకు వచ్చారు. ఈ క్రమంలో ఇరువురు తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా బైక్ అదుపు తప్పి డివైడర్‎ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందగా.. అనిల్ కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement