అనిరుధ్ పాడిన ‘క్రాక్’ సాంగ్ రిలీజ్

by Shyam |   ( Updated:2023-05-19 06:56:14.0  )
అనిరుధ్ పాడిన ‘క్రాక్’ సాంగ్ రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని రూపొందిస్తున్న చిత్రం ‘క్రాక్’. సరస్వతి ఫిలిం డివిజన్ బ్యానర్‌పై బి.మధు ఈ మూవీ నిర్మిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. రవితేజ సరసన బ్యూటీఫుల్ శ్రుతిహాసన్ నటిస్తోంది.

‘క్రాక్’ నుంచి ఇప్పటికే ఫోక్ సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతి పాడిన ఐటమ్ సాంగ్ ‘‘భూమి బద్దలు.. నా ముద్దుల సౌండు..’’ రిలీజ్ అయింది. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ అనిరుధ్ రవిచందర్ ‘క్రాక్’ మూవీలో పాడిన ‘భలేగా తగిలావే బంగారం’ సాంగ్ లిరికల్ వీడియో విడుదల చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్ స్వరపరిచిన ఈ పాటను అనిరుధ్ పాడటం విశేషం. ‘‘ఒప్పుల కుప్పా..వయ్యారి భామ..అవతారం..అలంకారం..చూస్తే అబ్బబ్బో’’అంటూ సాగే ఈ పాటకు లిరిక్స్ రామజోగయ్యశాస్త్రి అందించారు.

Advertisement

Next Story