విమానాశ్రయంలో మాస్ ఫీవర్ స్క్రీనింగ్ సిస్టం

by  |
విమానాశ్రయంలో మాస్ ఫీవర్ స్క్రీనింగ్ సిస్టం
X

దిశ, న్యూస్‌బ్యూరో: కొవిడ్-19 నేపథ్యంలో విదేశాల్లోని భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే అతిపెద్ద ఎవాక్యుయేషన్ కార్యక్రమం ‘వందే భారత్ మిషన్’. మన దేశానికి వస్తున్న అంతర్జాతీయ రిలీఫ్ ఫ్లైట్స్‌ను హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం హ్యాండిల్ చేస్తోంది. ఎయిర్‌పోర్టు హెల్త్ అధికారుల ద్వారా కొవిడ్ లక్షణాలు కలిగిన ప్రయాణికులను గుర్తించి వైరస్ వ్యాపించకుండా అరికట్టడానికి ప్రయాణికులకు అవసరమైన వైద్య సేవలు అందిస్తోంది. విదేశీ ప్రయాణికులు, విమాన సిబ్బంది తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఈ స్క్రీనింగ్ విధానం సామర్థ్యం పెంచడానికి భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సహకారంతో విమానాశ్రయానికి ఒక అత్యాధునిక థర్మల్ స్కానర్ ‘మాస్ ఫీవర్ స్ర్కీనింగ్ సిస్టమ్‌’ను అందించింది. దీనికి యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ నిధులను అందించింది. ఈ నూతన థర్మల్ స్కానర్‌ను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఎయిర్ పోర్టు ఆరోగ్య అధికారులు ఉపయోగిస్తున్నారు.

విమానాశ్రయంలోని ఈ థర్మల్ స్కానర్ ‘సీలింగ్ మౌంటెడ్ మాస్ ఫీవర్ స్క్రీనింగ్ సిస్టమ్’. ఇది స్ర్కీనింగ్ ద్వారా చర్మం ఉష్ణోగ్రతను కొలిచి, జ్వర సంబంధమైన లక్షణాలున్న వ్యక్తులను గుర్తిస్తుంది. ఈ స్కానర్ ఎలాంటి మానవ ప్రమేయమూ లేకుండానే చుట్టూ ఉన్న ఉష్ణోగ్రతకు తగినట్లు అడ్జస్ట్ చేసుకుని, దానికి అనుకూలంగా మారిపోతుంది. దీనిలోని యూసర్ ఇంటర్‌ఫేస్, డ్యూయల్ డిస్ ప్లే (డే కెమరా + ఇన్‌ఫ్రారెడ్) ద్వారా ఎవరైనా ప్రయాణికుల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్లయితే వారిని సులభంగా గుర్తించొచ్చు. ప్రస్తుతం ఉన్న థర్మల్ స్కానర్లతో పాటు ఈ నూతన థర్మల్ స్కానర్ వల్ల హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్‌కు ప్రయాణికుల స్క్రీనింగ్‌పై మరింత నియంత్రణ ఉంటుంది. ఈ సందర్భంగా జీహెచ్ ఐఏెల్ సీఈఓ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ విమానాశ్రయంలో ఆధునిక పరికరాన్ని ఏర్పాటు చేసిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. దీనికి స్పాన్సర్లైన ఏడీబీ, యునిసెఫ్లకు మేమెంతో రుణపడి ఉన్నామన్నారు. ఈ నూతన పరికరంతో 24గంటల పాటు విధులు నిర్వర్తించే ఆరోగ్య శాఖ అధికారుల పని సులభతరం అవుతుందన్నారు. ఏపీ, తెలంగాణ, ఆరోగ్య- కుటుంబ సంక్షేమ శాఖ సీనియర్ రీజినల్ డైరెక్టర్ అనురాధ మేడోజు మాట్లాడుతూ.. సీలింగ్ మౌంటెడ్ మాస్ ఫీవర్ స్కానర్ మా సిబ్బంది సామర్థ్యాన్ని ఎన్నో రెట్లు పెంచుతుందన్నారు.

40వేల మంది రాక

కొవిడ్-19 నేపథ్యంలో హైదరాబాద్ విమానాశ్రయానికి మే 2020 నుంచి ఇప్పటి వరకు దాదాపు 40 వేల మంది అంతర్జాతీయ అరైవల్ ప్రయాణికులు వచ్చారు. దేశానికి తిరిగి వస్తున్న అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఎయిర్‌పోర్టు అంతర్జాతీయ అరైవల్స్ వచ్చే మొత్తం ప్రాంతాన్ని, ఎయిరోబ్రిడ్జి నుంచి అరైవల్స్ ర్యాంప్ వరకు పూర్తిగా శానిటైజ్, ఫ్యూమిగేషన్ చేయడం జరుగుతోంది. బిల్డింగ్‌లోని ఎయిరోబ్రిడ్జిలు, వాష్ రూంలు, కుర్చీలు, కౌంటర్లు, ట్రాలీలు, రెయిలింగులు, డోర్లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, బ్యాగేజి బెల్టులు మొదలైన వాటిని శానిటైజేషన్ చేస్తున్నారు. అంతే కాకుండా ఎయిర్ పోర్టులో ఎయిర్ బ్రిడ్జి నుంచి టెర్మినల్ మొత్తం ప్రయాణికులు సామాజిక దూరం పాటించేలా చూస్తున్నట్లు జీఎంఆర్ ప్రకటించింది. ప్రయాణికుల స్క్రీనింగ్ అనంతరం, వారు ఇమిగ్రేషన్ క్లియరెన్స్ వైపు వెళ్తున్నారు. అక్కడ ప్రయాణికులు, ఇమిగ్రేషన్ అధికారులు ఒకరినొకరు తాకడాన్ని నివారించడానికి ఇమిగ్రేషన్ కౌంటర్ల వద్ద గ్లాస్ షీల్డులు బిగించారు. ప్రతి కౌంటర్ వద్దా సామాజిక దూరం నిబంధనలను ఏర్పాటు చేసారు.


Next Story

Most Viewed