- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపటి నుంచి మాస్కుల పంపిణీ: జగన్
ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి మాస్కుల పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, ఫలితాలపై ఆరాతీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. మాస్కుల తయారీని డ్వాక్రా వంటి స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని ఆయన సూచించారు.
ఏపీలోని 13 జిల్లాల్లో 11 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం రెడ్ జోన్‌లుగా పేర్కొనడం నేపథ్యంలో… తొలుత కరోనా హాట్ స్పాట్ ప్రాంతాల్లో మాస్కులు పంపిణీ చేయాలని జగన్ సూచించారు. ప్రతి ఒక్కరికీ 3 మాస్కులు పంపిణీ చేయాలని ఆయన ఆదేశించారు. లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ భౌతిక దూరం తప్పక పాటించేలా చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రేపటి నుంచి మాస్కుల పంపిణీ ప్రారంభించి, రెండు రోజుల తర్వాత మాస్కుల పంపిణీ విస్తృతం చేస్తామని ఆయన అన్నారు. తెలిపారు. క్వారంటైన్ ప్రాంతాల్లో సదుపాయాలపై నిరంతరం దృష్టి పెట్టాలని, క్వారంటైన్ పూర్తి చేసుకుని తమ ఇళ్లకు వెళ్లే వాళ్లకు రూ.2 వేల చొప్పున అందజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
Tags: andhrapradesh, ap, review meetin, ysrcp, jagan